కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. తిరువనంతపురం (కేరళ)లో అరుమనూర్ శ్రీ నయనార్ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఫర్మాన్ ఖాన్ (మహారాష్ట్ర) ఫేస్‌బుక్ ద్వారా పరిచయ్యారు. మతాలు వేరు కావడంతో మోనాలిసా కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. దీంతో ఆమె కేరళ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరింది. ఈ వివాహానికి కేరళ మంత్రి శివన్‌కుట్టి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మోనాలిసా ‘నాగమ్మ’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.