టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా టీమిండియా ఆట అద్భుతం! ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచకప్ సాధించడం ఇదే తొలిసారి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అదరగొట్టగా.. బౌలింగ్‌లో బుమ్రా, అక్షర్ పటేల్ సత్తాచాటారు. మ్యాచ్‌కు సంబంధించిన మెయిన్ హైలైట్స్ మళ్లీ చూసేయండి.