విరోష్ పెళ్లికి పిలవలేదని, లడ్డూలు ఇవ్వలేదని క్యూట్‌గా అలిగిన ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమగా స్పందించారు. "బుజ్జి తల్లీ.. నిన్ను మా ఇంటికి లంచ్‌కి పిలుస్తా, నీకిష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు.. ఇద్దరం కలిసి తిందాం" అంటూ రీట్వీట్ చేశారు. అభిమానుల పట్ల విజయ్ చూపిన ఈ ఆత్మీయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.