నర్సంపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
NEWS Mar 08,2026 11:03 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మహిళా పోలీసు సిబ్బందిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.