వెల్లుల్ల పాఠశాల ఆవరణలో శ్రమదానం
NEWS Mar 07,2026 03:23 pm
ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల కార్యాచరణలో భాగంగా వెల్లుల్ల గ్రామంలోని పాఠశాల ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి రజిని, పంచాయతీ కార్యదర్శి సేదాలు నారాయణ, ఉప సర్పంచ్ అనిరెడ్డి రాజశేఖర్ పాల్గొన్నారు. జీపీఓలు నాగరాణి, రాజేశ్వర్, వార్డు సభ్యులు హరీష్, రాజు, భూమేష్, జూనియర్ అసిస్టెంట్, అంగన్వాడి టీచర్లు శ్రీలత, రాధిక, లక్ష్మి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.