వరంగల్: షాపులో భారీ అగ్నిప్రమాదం
NEWS Mar 07,2026 12:38 pm
వరంగల్ జిల్లా జేపీఆర్ రోడ్‌లో దత్తాత్రేయ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణంలో ఉన్న ఫర్నిచర్ సామగ్రి భారీగా దగ్ధమై పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.