ఈ నెల 12న హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్
NEWS Mar 07,2026 11:42 am
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయబోతుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభిస్తారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.