సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
NEWS Mar 06,2026 09:21 pm
అనంతగిరి మండలం ఎంపీపీ మెతుల చేతుల మీదుగా బొర్రా పంచాయతీ ఎగువమామిడి గ్రామానికి 4 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చాలా ఏళ్ల నుండి వర్షానికి మట్టి రోడ్డు కొట్టుకుపోయి గుంతలుగా ఏర్పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఉండేదాని సిసి రోడ్డు నిర్మాణంతో ప్రజల కష్టం తీరిందన్నారు. వారితో ఎంపిటిసి అరుణ, సర్పంచ్ అప్పారావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.