ఘనంగా భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి
NEWS Mar 05,2026 05:02 pm
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య - సాక్షి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, పొన్నం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, చిరంజీవి, నాగార్జున, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, దిల్ రాజు, మోహన్ బాబు, అల్లు అరవింద్, దేవీశ్రీ ప్రసాద్ పలువురు హాజరయ్యారు.