మావోయిస్టులపై విషపు తూటాలు?
NEWS Mar 02,2026 11:58 am
నక్సల్స్‌ను అంతం చేసేందుకు ఎన్‌కౌంటర్లలో విషపు తూటాలు వాడారంటూ ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్’ పేరిట రాసిన కథనం సంచలనంగా మారింది. ‘బుల్లెట్ షెల్స్ తగిలిన సహచర మావోలు తీవ్రమైన నొప్పి, భరించలేని మంట, విపరీతమైన దాహం, వాంతులతో నరకం అనుభవించారు’ అని రాశారు. గతేడాది ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆయన పార్టీకి రాసిన లేఖలో ఈ విషయాలు తెలిపారు.