'సమ్మక్క సారలమ్మ' పోస్టర్ ఆవిష్కరణ
NEWS Jan 12,2026 01:17 pm
పెద్దపల్లి (మం) హన్మంతునిపేటలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు ఘనంగా ఆవిష్కరించారు. జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయని వారు తెలిపారు. జాతరకు రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సర్పంచ్‌లు శ్రీనివాస్, కుమార్, జాతర కమిటీ చైర్మన్ సుధాకర్ రావు, ఉప సర్పంచ్ కుమార్తో పాటు పలువురు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామస్థులందరూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.