ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా కోహ్లీ ఘనత!
NEWS Jan 11,2026 09:05 pm
న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ .. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో అతి వేగంగా 28వేల పరుగుల మైలురాయిని అందుకొన్న బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు. 3 ఫార్మాట్లలో కలిపి విరాట్ 557 మ్యాచుల్లో 624 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. కివీస్‌పై విరాట్ 42 పరుగులు చేసినప్పుడు.. రెండో స్థానంలో ఉన్న కుమార సంగక్కర (28,016)ను కోహ్లీ (28,017*) అధిగమించాడు. అత్యధిక పరుగుల లిస్టులో సచిన్ (34,357) అగ్రస్థానంలో ఉన్నాడు.