కోరుట్ల పట్టణంలోని ఎస్ఎఫ్ఐ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.