రోడ్డు నిబంధనలు పాటిస్తామంటూ ప్రమాణం
NEWS Jan 05,2026 03:56 pm
రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన పౌరులతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముర్తుజా అలీ ప్రమాణం చేయించారు. అందరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ద్విచక్ర వాహనం నడిపేప్పుడు హెల్మెట్ తప్పనిసరి ఆదరిస్తామని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనం నడుపుతామని ప్రమాణం చేశారు.