అనంతగిరి: గిరిజనులకు తప్పని డోలి మోతలు
NEWS Jan 05,2026 03:54 pm
అనంతగిరి మండలం ముళ్లపటం గ్రామానికి చెందిన గెమ్మెల. అమ్మి 3 రోజుల నుండి తీవ్ర విష జ్వరంతో బాధ పడుతుంటే కుటుంబ సభ్యులు సోమవారం ముళ్లపటం నుండి కంగుపుట్టు గ్రామం వరకు 3 కిలోమీటర్లు డోలిమోతతో ఆసుపత్రికి తరలించారు. ముళ్లపటం గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామానికి మంజూరైన రోడ్డును ప్రారంభించి పూర్తి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.