మేడిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును టవేరా కారు ఢీ కొట్టింది. క్షతగాత్రులు కోరుట్లకు చెందిన వారు, కర్ణాటకలోని గానుగపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని తిరిగి కోరుట్ల కు వస్తున్నారు. కాగా టవేరాలో ఉన్న 12 మంది ప్రయాణికుల్లో 8 మందికి గాయాలయ్యాయి, వారిని మెట్ పల్లి ప్రభుత్వ తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.