జాతీయ కబడ్డి పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి
NEWS Jan 03,2026 06:28 pm
పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 7 నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు.
ఈ పోటీలు అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్నాయని, మొత్తం 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.