టెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు - కలెక్టర్
NEWS Jan 03,2026 06:28 pm
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (టెట్) పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి కాబట్టి, అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు, సాంకేతిక సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ మొదలైన ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయి అని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రతి కేంద్రంలో టెక్నికల్ సిబ్బందిను నియమించామని కలెక్టర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.