BDK : పాల్వంచలో శనివారం ఉదయం పొగమంచు విస్తరించింది. తెల్లవారుజామున మొదలైన మంచు ఉదయం 9 గంటల వరకూ తగ్గలేదు. రోడ్లపై ముందున్నది స్పష్టంగా కనిపించక ప్రజలు నెమ్మదిగా రాకపోకలు సాగించారు. చలి ఎక్కువగా ఉండటంతో బయటకు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాఠశాల విద్యార్థులు కూడా పొగమంచులోనే స్కూల్ బ్యాగులతో పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది.