సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు
NEWS Jan 03,2026 06:27 pm
మహిళల విద్య, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సాంఘిక సంఘసంస్కర్త సావిత్రీబాయి పూలే 195వ జయంతిని తెలంగాణ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దమ్మపేటలో సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవ్యవస్థ, అంటరానితనం, అవిద్య వంటి సామాజిక అడ్డంకులను ఎదుర్కొని మహిళలతో పాటు బహుజనులకు విద్యను అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి అని వక్తలు కొనియాడారు. ప్లేగు బాధితులకు సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో బరగడి దేవదానం, శ్రీపాద పాల్గొన్నారు.