ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి
NEWS Jan 03,2026 06:32 pm
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రైతులు పండించిన సోయా పంటను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు రైతులతో కలిసి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ నివాసాల ముట్టడికి పిలుపునివ్వగా, ముందస్తుగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు రైతులు, BRS కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు జోగు రామన్నతో పాటు పలువురు రైతులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.