చైనా మంజా వాడకూడదు: అటవీ శాఖ
NEWS Jan 03,2026 06:29 pm
నిర్మల్ జిల్లా బాసర సర్కిల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో చైనా మాంజా వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, అడవులకు నిప్పు కారణంగా ఏర్పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాసరలోని జామ్ కస్తూర్బా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో, గాలిపటాలను చైనా మాంజాతో ఎగరేయకుండా కాటన్ మాంజాను మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. చైనా మాంజా వినియోగం ప్రాణాంతకమని, పశుపక్షాదులకు తీవ్ర నష్టం వాటిల్లి పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని అటవీ అధికారులు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.