పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీకి చెందిన నిరుపేద ఇంటర్మీడియట్ విద్యార్థి బత్తుల సుమంత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నేపాల్‌లో 2025 డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొన్న సుమంత్, జనవరి 1న షాట్‌పుట్ విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. TJLSS సంస్థ, COE క్యాంపస్, ఫిజికల్ డైరెక్టర్ శిక్షణతో పాటు దాతల సహకారంతో ఈ ఘన విజయం సాధించి పాల్వంచకు గర్వకారణంగా నిలిచాడు.