తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. దేవునికి నైవేద్యం సమర్పించేందుకు నెల రోజుల ముందుగానే ఆదివాసీలు తమ ఇళ్లలో నువ్వుల నూనెను తయారు చేస్తారు. అలా సిద్ధం చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా తీసుకువస్తారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ.15 రోజుల పాటు సాగుతున్న ఈ జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా తొడసం వంశస్తులు భారీగా తరలివస్తారు. ఖాందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.