మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
NEWS Jan 03,2026 12:21 pm
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు.