మద్యం మత్తులో ఆలయ గోపురంపైకి
NEWS Jan 03,2026 10:05 am
తిరుపతి TTD శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం. ఆలయంలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి వచ్చాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. గోపురం పైనుంచి కిందికి దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది 3గంటలు శ్రమించారు. గోపురానికి నిచ్చెనలు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.