వీడీసీలకు ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
NEWS Jan 03,2026 04:49 am
విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు (VDCలు) ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చే హక్కు వీడీసీలకు లేదన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గత ఏడాది పలు కేసులు నమోదు చేశామని, వీడీసీ అనుమతితో చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై, సంబంధిత వీడీసీలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు.