మంత్రి జూపల్లికి వినతి పత్రం
NEWS Jan 03,2026 10:16 am
మొన్నటి వర్షాకాలంలో వచ్చిన వరదల కారణంగా నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. దీంతో సుమారు 150 ఎకరాల వ్యవసాయ పంట పొలాలు పూర్తిగా నాశనం అయ్యాయి. చెరువులో నీరు లేకపోవడంతో మత్స్యకారులు జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని పెద్ద చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.