ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉషూ ఫెడరేషన్ కప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభను చాటారు. ఉషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వారు పథకాలు సాధించి జిల్లా గర్వాన్ని పెంచారు. పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా సన్మానించి పథకాలు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.