మరో కాశ్మీరంలా మంచిర్యాల జిల్లా
NEWS Jan 03,2026 10:08 am
చలికాల ప్రభావంతో మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో పొగమంచు పూర్తిగా వీడకపోవడంతో జిల్లా మరో కాశ్మీరంలా దర్శనమిస్తోంది. పొగమంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారు. మరోవైపు ప్రకృతి ప్రేమికులు స్వెటర్లు, శాలువాలు ధరించి పొగమంచుతో కమ్ముకున్న ఉదయపు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.