అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్
NEWS Jan 03,2026 10:07 am
జైపూర్ మండలంలో రొటీన్ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేశారు. కారులో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు లక్ష రూపాయల విలువైన దేశీదారు మద్యం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న నిఖిల్ రాజ్‌ను అదుపులోకి తీసుకొని, కారును సీజ్ చేసినట్లు జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్ వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.