యూసుఫ్ నగర్‌లో అంగడిని ప్రారంభించిన సర్పంచ్ పల్లె రాణి రాజు
NEWS Jan 03,2026 09:26 am
యూసుఫ్ నగర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామ సర్పంచ్ పల్లి రాణీ రాజు, ఉప సర్పంచ్ బాసవిని రమేష్, వార్డు మెంబర్స్, వీడీసీ మెంబర్స్ వారం అంగడిని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఇప్పుడు తమ ఊరిలోనే అంగడి ఏర్పాటు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.