కృష్ణా జిల్లా: ఇళ్ల వద్ద సోలార్ ప్లాంట్లు అంటే.. చాలా మంది భవనంపైనే ప్లాన్ చేస్తారు. బాపులపాడు (మం) వీరవల్లికి చెందిన సుంకర సుబ్రహ్మణ్యం మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. సౌర పలకలతో వేసే పందిరిని తన కారు షెడ్డుగానూ ఉపయోగించాలనుకున్నారు. కాస్త ఎత్తులో సోలార్ ప్లేట్లతో పందిరి వేసుకున్నారు. దీని నీడన తన కారు పార్కింగ్ చేసుకుంటున్నారు. దీంతో స్థలం కలిసివచ్చింది. కారుకూ రక్షణ ఛత్రం ఏర్పాటైంది.