శ్రీవారి లడ్డూల అమ్మకాల్లో కొత్త రికార్డు!
NEWS Jan 02,2026 08:31 pm
తిరుమల తిరుపతి దేవస్థానం 2025లో శ్రీవారి లడ్డూల విక్రయాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనంగా అమ్ముడయ్యాయని చెప్పింది. ఇది 10 శాతం అధికం. లడ్డూల రుచి, నాణ్యత దీనికి కారణమని టీటీడీ భావిస్తోంది. డిసెంబర్ 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని వెల్లడించింది.