మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి మరో 26 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం మేడారంలో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, బుధ, గురు, శని, ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 28న సారలమ్మ కన్నెపల్లి నుంచి, 29న సమ్మక్క చిలుకల గుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకోగా, 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.