న్యూఇయర్ డే భారత్ ఏం తిన్నదంటే..
NEWS Jan 02,2026 08:15 pm
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు భారీగా నమోదయ్యాయి. స్విగ్గీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రాత్రి 7:30 గంటలలోపే 2.18 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. బర్గర్లు, గులాబ్ జామూన్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. కొందరు కిచిడీ, ఉప్మా వంటి సంప్రదాయ వంటకాలు ఎంచుకోగా, బెంగళూరులో సలాడ్లకు డిమాండ్ కనిపించింది. ఇవన్నీ భారతీయ ఫుడ్ కల్చర్ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి.