ఏపీ No.1: ఫోర్బ్స్ - లోకేష్ స్పందన
NEWS Jan 02,2026 08:12 pm
FY26లో 25.3% వాటాతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రతిష్ఠాత్మక బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వార్తపై మంత్రి లోకేశ్ స్పందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఆధారంగా 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో దేశంలోని ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సంస్కరణలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక పాలన వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.