కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
NEWS Jan 02,2026 08:16 pm
పాల్వంచ మండల పరిధిలోని దంతెలబోర గ్రామ సమీపంలో కోడి పందాల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.39,450 నగదు, ఆరు కోడి పుంజులు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు సంబంధిత తదుపరి విచారణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూరల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.