బుదిరెడ్లపాలెంలో ఉచిత వైద్య శిబిరం
NEWS Jan 02,2026 07:39 pm
బుచ్చయ్యపేట మండలం కోమల్లపూడి గ్రామ సచివాలయం పరిధిలోని బుదిరెడ్లపాలెం గ్రామంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎం. గోవింద్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. క్యాంపులో గుండె సంబంధిత పరీక్షలు, కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్య సేవలు అందించనున్నారు. కోమల్లపూడి, బుదిరెడ్లపాలెం, గంటి కోర్లం, కృష్ణానగరం తదితర పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.