జువ్వాడి దంపతులకు స్వాగతం పలికిన నసీర్
NEWS Jan 01,2026 09:11 pm
యూఏఈ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఆయన కుటుంబ సభ్యులకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ముహమ్మద్ నసీర్ ప్రత్యేకంగా స్వదేశాగమన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులను పలువురు పార్టీ శ్రేణులు ఆహ్వానించి, పూల బొకేలు అందజేశారు.