కొమిరెడ్డి స్మారకార్థం అథ్లెటిక్స్ పోటీలు
NEWS Jan 01,2026 09:09 pm
జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో జిల్లా స్థాయి 4వ అథ్లెటిక్స్ పోటీలను దివంగత ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతక్క – కొమిరెడ్డి రాములు స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులను జనవరి 18న ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. అండర్–8, 10, 12, 14 వయస్సు విభాగాల్లో బాల–బాలికలు, అలాగే యువత–యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 60 మీ., 200 మీ. పరుగులు, లాంగ్ జంప్, షాట్ పుట్, కిడ్స్ జావెలిన్ త్రో వంటి విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి.