హోంగార్డ్ ఛాతిపై SP టాటూ చిత్రం
NEWS Jan 01,2026 03:58 pm
ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రానికి చెందిన బూస లక్ష్మణ్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్ పనితీరు, సమర్థత, ప్రజలతో మమేకమయ్యే తీరు చూసి ఆకర్షితుడైన లక్ష్మణ్, తన ఛాతిపై మహాజన్ చిత్రాన్ని టాటూ వేయించుకునేంత అభిమానాన్ని వ్యక్తం చేశాడు. 2నెలల ముందే ముంబయి టాటూ ఆర్టిస్ట్ వద్ద అపాయింట్‌మెంట్ బుక్ చేసి ప్రత్యేకంగా టాటూ వేయించుకున్నాడు. ఒక అధికారి పట్ల హోంగార్డ్ ఇంత ప్రత్యేకంగా చూపిన అభిమానంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.