2026: బీఆర్ఎస్ సెటైరికల్ కార్టూన్
NEWS Jan 01,2026 02:39 pm
TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ కార్టూన్‌తో ప్రచారం చేస్తోంది. ‘2 - రెండేండ్ల సమయం వృథా, 0 - కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 - కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6 - ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ కార్టూనిస్ట్ మృత్యంజయతో వేయించిన వ్యంగ్య కార్టూన్‌తో ప్రశ్నించింది. ఎన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.