HYD: న్యూఇయర్ వేడుకల్లో విషాదం
NEWS Jan 01,2026 11:13 am
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో న్యూ ఇయర్ సందర్భంగా గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. మద్యం తాగి, బిర్యానీ తిన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందాడు. 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.