మారుమూల పల్లెల్లోనూ 5G ‘వైర్‌లెస్’ సేవలు
NEWS Jan 01,2026 10:41 am
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గడపకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును ప్రవేశ పెడుతోంది. కేవలం కేబుల్ ద్వారానే కాకుండా, వైర్‌లెస్, శాటిలైట్ సాంకేతికతను జోడిస్తుంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కేబుల్ వేయడం సాధ్యం కాని 690 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, మైనింగ్ జోన్లలో ఉన్న ఈ పల్లెలకు ఇంటర్నెట్ అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ కంపెనీతో ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందించే ఈ సాంకేతికతపై టీ-ఫైబర్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు స్టార్‌లింక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఒప్పందం ఖరారైతే, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల తండాల్లోనూ ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. వైర్‌లెస్ 5G సేవలను గ్రామీణ స్థాయిలో ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని రామకృష్ణాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.