బొమ్మెనలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
NEWS Jan 01,2026 05:05 am
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం, అన్నప్రసాదంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వి.డి.సి. చైర్మన్ తీపి రెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప పడిపూజ జరగడం సంతసకరమని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రతి సంవత్సరం గ్రామస్థుల సమిష్టి భాగస్వామ్యంతో అయ్యప్ప పడిపూజను మరింత వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.