ప్రజలకు సీఎంలు శుభాకాంక్షలు
NEWS Jan 01,2026 02:41 am
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ సీఎంలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గడిచిన 2025 సంవత్సరం రాష్ట్రానికి కీలక మలుపుగా నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రజల నమ్మకాన్ని బలపరిచే విధంగా పాలన కొనసాగిందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం మరింత దృఢంగా ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.