మెట్‌పల్లిలో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు
NEWS Jan 01,2026 02:31 am
మెట్‌పల్లి: హనీట్రాప్ దందాను పోలీసులు భగ్నం చేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి, మహిళ ద్వారా ఉచ్చులో పడేసి రహస్యంగా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన ముఠాను పోలీసులు ఛేదించారు. వ్యాపారిపై రూ.10 లక్షల డిమాండ్ చేసిన ఘటనతో కేసు బయటపడింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, త్వరలోనే పట్టుకుంటామని, ఇటువంటి ఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.