బోజన్నపేటలో చెత్త, మురుగు సమస్యలు
NEWS Jan 01,2026 02:32 am
పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా గ్రామంలోని ప్రధాన కాలువ మురికితో నిండిపోయింది. చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు నిలిచిపోవడం వల్ల దోమలు, కీటకాలు అధికంగా పెరిగి ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట పిల్లలు, వృద్ధులు బయటికి రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. వెంటనే మురుగు కాలువలను శుభ్రపరచి, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్థులు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.