యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
NEWS Dec 31,2025 04:35 pm
యూట్యూబర్ అన్వేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. సినీనటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో అన్వేష్ ఇటీవల అభ్యంతరకర వీడియోలు ప్రచారం చేశాడని ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఖమ్మంలోని ఖానాపురంహవేలి పోలీస్ స్టేషన్‌లోనూ అతనిపై మరో కేసు నమోదైంది. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ హిందువులు పూజించే దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశాడని జి. సత్యనారాయణరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.